Wednesday, February 5, 2025

Legal Heir Certificate |Family Member Certificate | Legal Heir Certificate Download



ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ (కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం) – పూర్తి వివరాలు

ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఒక అధికారిక పత్రం, ఇది మరణించిన వ్యక్తి మరియు అతని కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంబంధాన్ని నిర్ధారిస్తుంది. ఇది పింఛన్లు, ఆస్తి హక్కులు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ప్రభుత్వ ప్రయోజనాలు మరియు పెన్షన్ బ్యాంకు అకౌంట్స్ క్లయిమ్ ఇతర చట్టపరమైన అవసరాల కోసం ఉపయోగించబడుతుంది.

ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉపయోగాలు

  •  వారసత్వ మరియు ఆస్తి సంబంధిత హక్కులను నిర్ధారించుకోవడానికి
  •  ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు పొందేందుకు
  •  పింఛను, బ్యాంకు డబ్బులు మరియు బీమా క్లెయిమ్ చేసేందుకు
  •  లీగల్ మరియు అధికారిక డాక్యుమెంట్ల కోసం అవసరం
  • పెన్షన్ క్లెయిమ్ కోసం – ప్రభుత్వ ఉద్యోగుల మరణానంతరం వారి కుటుంబ సభ్యులు పెన్షన్ పొందడానికి
  • ఇతర చట్టపరమైన అవసరాలు – వారసత్వ ధృవీకరణ, నామినీ మార్పులు, ఆధార్ లేదా ఇతర ప్రభుత్వ ధృవీకరణ పత్రాల్లో మార్పుల కోసం.

ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్


1. అభ్యర్థి దరఖాస్తు ఫారం (MeeSeva ) మీసేవ కార్యాలయంలో అందుబాటులో ఉంటుంది)

2. దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు

3. మృతదేహ ధృవీకరణ పత్రం (తహసీల్దార్ కార్యాలయం నుండి వచ్చింది లేదా గ్రామపంచాయతీ నుండి వచ్చింది సరిపోతాది )

4. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు

5. రేషన్ కార్డు లేదా ఫ్యామిలీ అందరివీ ఆధార్ కార్డు

6. సంబంధిత మండల రెవెన్యూ అధికారి (MRO) లేదా తహసీల్దార్ ద్వారా ధృవీకరించబడిన నివాస ధృవీకరణ పత్రం

7.నోటరీ పత్రం కోర్టు నుండి తీసుకోవాలి ఇది తప్పనిసరి

8.పంచనామా పత్రాలు తప్పనిసరిగా ఉండాలి

 

ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు ఎలా చేయాలి?


1.ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది మీకు దగరలో ఉన్న మీసేవ లో దరఖాస్తు చేసుకోవాలి
2.పైన రాసిన ధ్రువీకరణ పత్రాలు అని కూడా మీతో పట్టు తప్పనిసరిగా తీసుకెళాలి
3.ముఖ్య గమనిక ఏంటి అంటే మీ మొబైల్ లో కాని ఫోన్ ఫోటో లో తీసుకెలకండి అది మీకు సర్టిఫికెట్ రాకుండా కూడా చేయవచ్చు
4.మీరు అప్లికేషన్ ఫ్రొమ్ తప్పనిసరిగా జాగ్రత్తగా నింపాల్సి ఉంటది
5.మీసేవ వెబ్ సైట్ లింక్ ఎక్కడ ఇవ్వడం జరిగింది లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి
6.మీకు ఇంకా మంచిగా అర్ధం కావాలి అంటే క్రింద వీడియో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో మొత్తం చుడండి అర్ధం కాకపోతే మల్లి మల్లి చుడండి మీకు మొత్తం అర్ధం ఐపోతాది



ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

1.మీసేవ వెబ్ సైట్ లో కి వెళ్ళాలి నేను ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి లింక్
2.లింక్ క్లిక చేసాక మీసేవ వెబ్ సైట్ లోకి వెళ్లడం జరుగుతుంది అక్కడ మీకు అప్లికేషన్ చేసాక రసీదు మీద అప్లికేషన్ నెంబర్ ఉంటది ఆ నెంబర్ ని అందులో రాసి మీ సర్టిఫికెట్ స్టేటస్ ను


సర్టిఫికేట్ పొందడానికి సమయం

ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేసాక మినిమమ్ 45 డేస్ టైం ఉంటదిసాధారణంగా 7 నుండి 15 రోజులలోపు సర్టిఫికేట్ మంజూరు అవుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇది 45 రోజుల వరకు ఆలస్యమవ్వొచ్చు పండుగలు సెలవులు ఉంటె ఇంకా కొంచం టైం ఎక్కువగా పట్టవచ్చు ముఖ్యగామానిక పంచనామా పూర్తి చేసాక మీరు పైన టైం ను మీరు అనుసరించాలి

ముఖ్యమైన సూచనలు

1.ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ద్రువీకరణకు సరియిన పత్రాలు ఇవ్వాల్సి ఉంటది

2.తప్పుడు సమాచారం ఇస్తే మీ దరఖాస్తు తిరస్కరించడం జరుగుతుంది
3.తప్పుడు సమాచారం ప్రభుత్వ నియమాలను ఉలంగాణ కావచ్చు
4.మీరు దరఖాస్తు చేసిన తరువాత మీ మొబైల్ కు అప్డేట్ లాంటివి రావడం జరుగుతుంది

మీకు ఎలాంటి సమాచారం వీడియో లో కావాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ లో ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ ఉంటాయి ఎక్కడ లింక్ ఇవ్వడం జరుగుతుంది అది క్లోక్ చేసి మా యూట్యూబ్ ఛానల్ కి మీరు రావచ్చు ఏది మీకు ఎంతగానో అవసరం అయితది అని నేను అనుకుంటున్న .

యూట్యూబ్ ఛానల్ లింక్ లింక్ క్లిక్ థాంక్స్ ....








No comments:

Post a Comment